NTV Telugu Site icon

Manu Bhaker: వారందరికీ కృతజ్ణతలంటున్న భారత ఒలంపిక్ విజేత..

Manu Bhaker

Manu Bhaker

Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. 22 ఏళ్ల మను ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘నాకు లభిస్తున్న మద్దతు, శుభాకాంక్షలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2 కాంస్య పతకాలు సాధించడం కల సాకారమైంది. ఈ ఘనత నాదే కాదు, నన్ను నమ్మి నన్ను ఆదరించిన వారందరికీ దక్కింది. నా కుటుంబం, కోచ్ జస్పాల్ రాణా సర్, NRAI, TOPS, SAI, OGQ, Performax ముఖ్యంగా హర్యానా ప్రభుత్వంతో సహా నా మద్దతుదారుల యొక్క తిరుగులేని మద్దతు లేకుండా నేను దీన్ని ఎప్పటికీ చేయలేను. అంటూ తెలిపింది.

IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ

మను తన పోస్ట్‌లో ఇంకా.. ‘మన దేశం కోసం అతిపెద్ద వేదికపై పోటీ చేయడం మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు.. నాతో అడుగడుగునా నిలబడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం అంటూ తెలిపింది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా మను సరికొత్త చరిత్రను లిఖించింది.

Show comments