Site icon NTV Telugu

Nandamuri Balakrishna Fans: ఊగిపోతున్న ఫాన్స్.. బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం! అంతేకాదు..

Mansion House Abishekam

Mansion House Abishekam

Mansion House Abishekam for Hero Balakrishna at Bangalore: టాలీవుడ్ అగ్ర హీరో, నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే ఫ్యాన్ ఊగిపోతుంటారు. సిచ్యూవేషన్‌తో సంబంధం లేకుండా.. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఉందంటే ఊరుకుంటారా?.. ఆ రచ్చ మరో లెవల్లో ఉంటుంది. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ సందర్భంగా ఫాన్స్ ఆయన చిత్ర పటానికి ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు.

భగవంత్ కేసరి సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటకలో బాలయ్య బాబు ఫాన్స్ తమ అభిమానాన్ని భిన్నంగా చాటుకున్నారు. పాలాభిషేకం బదులుగా ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు. బెంగళూరులోని మారతహళ్లిలో ఉన్న వినాయక థియేటర్ ముందు ఈరోజు ఉదయం 4 గంటలకు బాలకృష్ణ చిత్ర పటానికి మాన్షన్ హౌస్ మందు బాటిల్‌తో ఓ ఫ్యాన్ అభిషేకం చేశాడు. అంతేకాదు దీపారాధన చేసి కొబ్బరి కాయలు కూడా కొట్టారు. మరోవైపు భారీగా బాణాసంచా కూడా కాల్చారు.

Also Read: Bhagavanth Kesari Twitter Review: ‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య బాబు ఖాతాలో హ్యాట్రిక్! శ్రీలీల సూపర్బ్

బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘బాలయ్య బాబు హా.. మజాకా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘బాలయ్య బాబుతో అట్లుంటది మరి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ కాగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించారు. కూతురు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగుతుంది.

Exit mobile version