Threat Call to NCP President Sharad Pawar: ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్‌లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలోనూ ఓసారి పవార్‌ను చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే అప్పుడు అరెస్టు చేసి వదిలేశామని తెలిపారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ బెదిరింపు కాల్ చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతడిని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు.
Man Stuck between Rocks: రాజు సేఫ్.. కామారెడ్డి పోలీసులను అభినందించిన డీజీపీ
తన భార్య తనను వదిలేసి ఎన్సీపీ కార్యకర్తతో పారిపోయిందని.. ఈ విషయంలో పార్టీ చీఫ్ జోక్యం చేసుకోకపోవడంతో రెచ్చిపోయి ఈ నేరానికి పాల్పడ్డానని ముంబై పోలీసులకు తెలిపాడు. 46 ఏళ్ల నిందితుడు బీహార్‌కు మారడానికి ముందు 10 సంవత్సరాలు తన భార్యతో పుణేలో నివసించాడని పోలీసులు తెలిపారు. అతను పుణెలో ఉన్న సమయంలో ఆమె అతడిని విడిచిపెట్టి ఎన్సీపీ కార్యకర్తను పెళ్లి చేసుకుందని వెల్లడించారు. శరద్ పవార్ ఇంట్లోని ల్యాండ్‌లైన్ ఫోన్‌కు కాల్ చేసి హత్యా బెదిరింపులు చేశాడనే ఆరోపణతో ముంబై పోలీసులు బుధవారం నిందితుడిని పాట్నా నుంచి అదుపులోకి తీసుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రెండు రోజుల పోలీసు కస్టడీ విధించిందని వెల్లడించారు. నిందితుడు చేసిన క్లెయిమ్‌లను ధృవీకరించాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శరద్ పవార్‌కు ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ చంపేస్తానని బెదిరించాడు. అదే నెంబర్ నుంచి దాదాపు 20 నుంచి 25 కాల్స్ వచ్చాయి. కాగా.. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించామని, అతడు బీహార్ వాసి అని పోలీసులు తెలిపారు.
