గతంలో టీమిండియా తరుఫున ప్రాతినిధ్యం వహించిన బెంగాల్ క్రికెటర్, మంత్రి మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022-23 సీజన్ లో మనోజ్ తివారీ.. రంజీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో బెంగాల్ జట్టు సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది.
Visakha Constable Case: సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు
మనోజ్ తివారీ… తన సొంత రాష్ట్రానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అని కూడా తెలిసిందే. గత ఎన్నికల్లో టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మనోజ్ తివారీ… మమతా బెనర్జీ క్యాబినెట్లో స్థానం సంపాదించాడు. కాగా, తివారీ ఇన్ స్టాగ్రామ్ లో తన రిటైర్మెంట్ ప్రకటనను పోస్టు చేశాడు. క్రికెట్ వల్లే తాను ఇంతటివాడ్నయ్యానని, క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని భావోద్వేగం చెందాడు. తన కెరీర్ ఆద్యంతం వెన్నంటి ఉన్న కుటుంబ సభ్యులకు, భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
Keerthy Suresh: ముందు భయపడ్డాను.. కొట్టిన తర్వాత చెప్తా.. ‘భోళా శంకర్’పై కీర్తి కీలక వ్యాఖ్యలు
మనోజ్ తివారీ టీమిండియా తరఫున 15 మ్యాచ్ ల్లో ఆడాడు. 2008లో భారత జట్టుకు ఎంపికైన ఈ క్రికెటర్ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తివారీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 141 మ్యాచ్ ల్లో 9 వేలకు పైగా పరుగులు సాధించాడు. అందులో 29 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉండడం విశేషం. ఐపీఎల్ లోనూ ఆడిన తివారీ 98 మ్యాచ్ ల్లో 1,695 పరుగులు చేశాడు.
