Assembly: స్పీకర్‌కు తాళం, కీ ఇచ్చిన సీఎం.. దేనికంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అసెంబ్లీలో (Punjab Assembly) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహజంగా సభలో విపక్షాలు ఆందోళన చేస్తే మార్షల్స్ చేత పంపించేస్తారు. అలాంటిది ప్రతిపక్ష సభ్యులు బయటకు వెళ్లకుండా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది.
పంజాబ్ అసెంబ్లీలో (Punjab Assembly) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ అంశంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలంటూ స్పీకర్‌ను సీఎం (Bhagwant Mann) కోరారు. అంతేకాకుండా తాళం, కీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. విపక్షాలు వాకౌట్ చేయకుండా వారిని సభలోనే ఉండేలా లోపల గడియపెట్టాలని విజ్ఞప్తి చేయడం మరింత గందరగోళానికి దారితీసింది.
Also Read
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగాయి. మార్చి 1న బడ్జెట్ సమావేశాలు (Budget session) ప్రారంభం అనంతరం గవర్నర్ చేసిన ప్రసంగానికి విపక్ష ఎమ్మెల్యేలు అడ్డుతగలారంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లను పక్కన పెట్టిన స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ప్రత్యేక చర్చకు అనుమతించారు. చర్చ మొదలయ్యే కొన్ని క్షణాల ముందు స్పీకర్ దగ్గరకు వెళ్లిన సీఎం భగవంత్‌మాన్.. ఓ కవరులో తాళం, కీని అందించారు.
సభ లోపలి నుంచి తాళం వేయాలని స్పీకర్‌ను కోరారు. తద్వారా విపక్ష సభ్యులు చర్చ నుంచి తప్పించుకోకుండా చూడొచ్చని సూచించారు. విపక్ష నేత ప్రతాప్‌సింగ్ బజ్వా మాట్లాడుతూ.. తాము ఎక్కడికీ వెళ్లమని, సభలోనే ఉంటామన్నారు. ఈ క్రమంలోనే సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జోక్యం చేసుకున్న స్పీకర్.. సభలో చర్చ జరిగేలా చూసేందుకు తాళం ఓ సంకేతమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో చివరకు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త పరిణామానికి దారి తీసింది.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!