NTV Telugu Site icon

Manmohan Singh: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మన్మోహన్ సింగ్ భౌతికకాయం

Manmohan

Manmohan

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఇప్పుడు ప్రజల సందర్శనార్ధం డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఇక్కడ ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తారు. దీని తర్వాత అతని అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహిస్తారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుక వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆర్మీ వాహనం ఆపి, ఆయన మృతదేహాన్ని భుజాలపై మోసుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ గంటపాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. దీని తర్వాత ఆయన చివరి యాత్ర నిగంబోధ్ ఘాట్‌కు ప్రారంభమవుతుంది.

Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్..

ప్రస్తుతం రాహుల్ గాంధీ, పి చిదంబరం, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్నారు. ఆయన చివరి దర్శనం ప్రారంభమైన నేపథ్యంలో.. సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక నేత సహా పలువురు నేతలు మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రాజ్‌ఘాట్ సమీపంలోనే జరగాలని కాంగ్రెస్ నేత సుఖ్‌జీందర్ సింగ్ రంధావా అన్నారు. ప్రధానమంత్రులందరి అంత్యక్రియలు రాజ్‌ఘాట్ దగ్గర జరిగినట్లే ఆయన అంతక్రియలు జరగాలని ఆయన కోరారు.

Show comments