Manjummel Boys Record in Telugu: ఈ మధ్య కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసాన్ని దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ అద్భుతంగా తెరకెక్కించారు. మలయాళంలో హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్‌ను అదే పేరుతో తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. తెలుగు బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేస్తోంది.
మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్‌లో ఓ రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన మలయాళ డబ్బింగ్ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. టికెట్ పోర్టల్ బుక్‌మై షోలో మొదటి రోజు 34.47 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పాజిటివ్ టాక్ రావడంతో రెండోరోజు మరిన్ని ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మొదటి రోజుతో పోలిస్తే.. రెండోరోజు బుకింగ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం (ఏప్రిల్ 7) దాదాపు అన్ని షోల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వచ్చే వారంలో కూడా ఈ సినిమా టిక్కెట్లు మరింతగా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Virat Kohli Century: సెంచరీ బాదినా.. విరాట్ కోహ్లీపై ట్రోలింగ్!
మంచి వసూళ్లు వస్తుండడంతో మంజుమ్మల్ బాయ్స్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ సంస్థ ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో నటించారు. పరవ ఫిలింస్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగులో రిలీజ్ చేసింది.