Manipur Violence: మణిపుర్లో ఘోరం.. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య! పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Students Killed in Manipur who missing in July: మణిపుర్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గత జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో మణిపుర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం కారణంగా అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోయిన సమయంలో ఈ ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు.
మణిపుర్ అల్లర్ల అనంతరం జులై 6వ తేదీన ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో.. అమ్మాయి నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు బాగానే ఉన్నాయని భావించిన ఆమె.. తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు అప్పుడు వెల్లడించారు. దాదాపుగా మూడు నెలల అనంతరం ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
Also Read: Kakani Govardhan Reddy: సీఎం చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధర: మంత్రి కాకాణి
అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను మణిపుర్ ప్రభుత్వం గతవారం ఎత్తి వేసింది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో సోమవారం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులను సాయుధులు కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటో తెలియజేస్తుండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు ఉన్నట్లు మరో ఫొటోలో కనిపిస్తోంది. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా ఉంది. హత్యకు గురైన విద్యార్థులు మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి