Site icon NTV Telugu

Manipur: నేడు హోంమంత్రిత్వశాఖ అధికారులతో మణిపూర్ గిరిజన నాయకుల భేటీ

Manipur

Manipur

ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు మణిపూర్‌కు చెందిన వివిధ గిరిజన సంస్థల ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో పాటు హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలవనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక దాడులపై హోంమంత్రిత్వాశాఖ అధికారులను కలిసి వివరించేందుకు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), గిరిజన ఐక్యత కమిటీ, కుకి ఇన్పి మణిపూర్, జోమి కౌన్సిల్, హిల్ ట్రైబల్ కౌన్సిల్ తో పాటు అన్ని తెగల కౌన్సిల్‌లకు చెందిన 9 మంది నాయకులు వెళ్తున్నారు.

Read Also: IND vs ENG: భారత్‌ బ్యాటింగ్‌ బాగా మెరుగుపడాల్సి ఉంది.. మాజీ ఆటగాడు వార్నింగ్‌!

ఇక, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, గిరిజనులకు ప్రత్యేక పరిపాలన (ప్రత్యేక రాష్ట్రానికి సమానం) ఇవ్వాలని గిరిజన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ను కేంద్ర హోం మంత్రితో పాటు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తిరస్కరించారు. మణిపూర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని ఆ రాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు. మణిపూర్‌లో ముఖ్యంగా సరిహద్దు పట్టణమైన మోరేలో తాజా పరిస్థితులపై హోం మంత్రిత్వ శాఖ అధికారులకు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ వివరించారు.

Exit mobile version