Site icon NTV Telugu

Manika Batra: చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ స్టార్.. ఆటలోనే కాదు అందంలోనూ స్టారే..

Manika Batral

Manika Batral

Manika Batra: ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనిక బాత్రా చరిత్ర సృష్టించి దేశం గర్వించేలా చేసింది. 16వ రౌండ్‌కు అంటే ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రితికా పవాడేపై 4-0తో విజయం సాధించిన ఆమె ఇప్పుడు పతకం సాధించే దిశగా ముందుకు సాగుతోంది. ఆమె తన ఆటతో మాత్రమే కాకుండా స్టైల్‌తో కూడా అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. మనిక నిజజీవితంలో చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Read Also: Manu Bhaker:స్వాతంత్ర్యానంతరం రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డ్..

దానికి సంబంధించిన రుజువును ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా చూడవచ్చు. వెస్ట్రన్ అయినా, ట్రెడిషనల్ అయినా ప్రతి లుక్ లో ఆమెను చూస్తుంటే అందాల రాణిలా కనిపిస్తుంది. ఆమె అందం ముందు బాలీవుడ్ అందాలు కూడా తేలిపోతాయంటే నమ్మాలి. మైదానంలో తన ఆటతో ప్రజల హృదయాలను గెలుచుకున్నప్పటికీ, ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా అద్భుతమైనది. ఒలింపిక్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న మొదటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన మనిక బాత్రా భారత క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Manika

Exit mobile version