Site icon NTV Telugu

Manik Rao Thakre : రేపటి నుంచి తెలంగాణ హాత్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలు

Manik Rao Thakre

Manik Rao Thakre

రేపటి నుంచి తెలంగాణ హాత్ సే హాత్‌ జోడో అభియాన్ పాదయాత్ర లు ప్రారంభం అవుతున్నాయని వెల్లడించారు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే. అయితే ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడారంలో టీపీసీసీ అధ్యక్షులు అక్కడ ముఖ్య నాయకులు పాదయాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన ప్రధాన ప్రసంగాలను బీజేపీ 8 ఏళ్లలో దేశంలో చేసిన ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలను ఛార్జ్ షీట్ రూపంలో జనంలోకి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Also Read : Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌పై కేసు.. ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన యోగా గురు

ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక పనులపై ఛార్జ్ షీట్ విడుదల చేసామని, ఇవన్నీ జనంలోకి తీసుకెళ్తామన్నారు థాక్రే. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న దృశ్యా ఆయా సభ్యులు ఇప్పుడు పాదయాత్రలో వెసులుబాటు తీసుకొని పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్నందున పార్లమెంట్ లో పాల్గొనే అవకాశం లేదని, అందరూ నాయకులు వారి వారి నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేస్తారని ఆయన వెల్లడించారు. వారి వారి అవకాశాలను బట్టి ఇతర ప్రాంతాలలో కూడా పాల్గొంటారని, పాదయాత్రలో జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి హాత్ సే హాత్ జోడో పోస్టర్ ను అంటించి ఈ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించడానికి కాంగ్రెస్‌తో చేయి కలపాలని కోరుతున్నామని, పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని మానిక్‌ రావు థాక్రే వెల్లడించారు.

Also Read : ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

Exit mobile version