Mani Sharma : ఆ ఇద్దరి స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మణిశర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని మణిశర్మ అన్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మణిశర్మ మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి మరియు ఖలేజా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు .అలాగే పవన్ కల్యాణ్ కు ఖుషీ మరియు గుడుంబా శంకర్ లాంటి మ్యూజికల్ హిట్స్ ను అందించారు.కానీ ఈ ఇద్దరూ ఈ మధ్య కాలంలో మణిశర్మతో సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం ఏమని ఆయనను అడిగగా మహేష్ బాబుతో తన చివరి సినిమా వరకూ పూర్తి నిబద్ధతతో పని చేశానని, అయితే తర్వాత ఏం జరిగిందో, ఎవరు తనపై ఏం ఎక్కించారో తెలియదని మణిశర్మ అన్నారు.
భవిష్యత్తులో మహేష్ తో ఏవైనా సినిమాలు చేస్తారా అని అడగ్గా.. అతడు కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తనను పిలవడం లేదని చెప్పారు.ఇక పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తూ ఆయనతో మంచి బాండింగ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు.. పవన్ కెరీర్లో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ అయిన ఖుషీ మరియు గుడుంబా శంకర్ మ్యూజిక్ ఎలా చేసారో కూడా చెప్పారు. ఖుషీలో కేవలం చెలియ చెలియ పాటను తాను పవన్ తో కలిసి కూర్చొని మ్యూజిక్ కంపోజ్ చేశానని అలాగే గుడుంబా శంకర్ లో మాత్రం అన్ని పాటలను ఇద్దరం కలిసి చేసినట్లు గా తెలిపారు మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు.. దేవీ శ్రీకి ఒకటి, తమన్ కు ఒకటిఅలాగే తనకు ఒకటి.. ఇలా ఇస్తే ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ మ్యూజిక్ అందుతుందని మణిశర్మ అభిప్రాయపడ్డారు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!