Site icon NTV Telugu

Mangalavaram :ఆ మూడు ఫార్మెట్స్‌లో అదరగొట్టిన ‘మంగళవారం’ మూవీ..

Whatsapp Image 2024 02 28 At 7.43.58 Am

Whatsapp Image 2024 02 28 At 7.43.58 Am

టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్‌, ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా అదరగొట్టింది. మంగళవారం మూవీ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇటీవల స్టార్ మా ఛానల్‌లో మంగళవారం మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 8.3 టీఆర్‌పీ రేటింగ్ వచ్చినట్లు సినిమా యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇటీవల కాలంలో స్టార్‌మాలో ప్రీమియర్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా మంగళవారం మూవీ నిలిచింది.మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ప్రియదర్శి మరియు చైతన్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌తో ప్రయోగాత్మకంగా దర్శకుడు అజయ్ భూపతి ఈ మూవీని తెరకెక్కించాడు. ఆకట్టుకునే ట్విస్టులు, అదిరిపోయే సంగీతం మరియు అదిరిపోయే కెమెరా వర్క్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. థియేటర్లలో హిట్టైన ఈ మూవీ ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా మంగళవారం మూవీ రికార్డ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. అలాగే బుల్లితెరపై 8.3 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది. ఎలాంటి బిగ్ స్టార్ లేకపోయినా విడుదలయిన మూడు ఫార్మాట్ లలో మంగళవారం మూవీ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది.అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 మూవీతోనే పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్‌తో తొలి అడుగులోనే పాయల్ యూత్ ఆడియెన్స్‌ను ఎంతగానో మెప్పించింది. మళ్లీ ఆ స్థాయి సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూసిన పాయల్ నిరీక్షణకు మంగళవారం మూవీతో తెరపడినట్లు అయింది.

Exit mobile version