Site icon NTV Telugu

Mangalavaram : అప్పడప్పడ తాండ్ర సాంగ్ మోత మోగిస్తుందిగా..

Whatsapp Image 2023 11 03 At 9.44.36 Pm

Whatsapp Image 2023 11 03 At 9.44.36 Pm

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది..వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంగళవారం”.. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రం సినిమా తో డిజాస్టర్‌ అందుకున్న అజయ్‌ భూపతి ఈ సారి హార్రర్‌ కమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో నవంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ఇప్పటినుంచే వరుసగా అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫోర్త్ సింగిల్‌ను విడుదల చేశారు.’అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర నీకో ముక్క నాకో ముక్క’ అంటూ సాగే ఈ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటలో కీడా కోలా దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అయితే ఈ పాట ఐటెం సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఆంధ్రాలో ‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర’ పాట చాలా ఫేమస్. దీన్ని ఇప్పుడు తన సినిమాలో ఐటమ్ సాంగ్‌గా పెడుతున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ పాటను గణేష్ ఆడెపు రాశారు. రాహుల్ సింప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు… ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది…ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య మరియు అజయ్ ఘోష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version