NTV Telugu Site icon

Mangalavaaram : అప్పడప్పడ తాండ్ర సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Whatsapp Image 2023 11 13 At 4.50.11 Pm

Whatsapp Image 2023 11 13 At 4.50.11 Pm

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ అలాగే కాన్సెప్ట్‌ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్‌ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నారు మేకర్స్…ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్‌ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర అనే స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అప్పడప్పడ తాండ్ర సాంగ్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..సాంగ్ లో తరుణ్ భాస్కర్ ఊరమాస్‌ గెటప్‌లో కనిపించాడు.ఇదిలా ఉంటే రేపు ఉదయం (నవంబర్ 14) 11:07 గంటలకు ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

ప్రస్తుతం ఆ స్టిల్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.ఇటీవలే ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను కూడా మేకర్స్‌ నిర్వహించారు.. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్‌ హాజరయ్యారు… మంగళవారం నుంచి మేకర్స్ ఇప్పటికే మహాలక్ష్మమ్మ జాతర నేపథ్యంలో అగ్రెసివ్‌గా సాగే గణగణ మోగాలిరా సాంగ్‌ను లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.మంగళవారం సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌, మరియు అదరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య మరియు అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1723985296717754438?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1723985296717754438%7Ctwgr%5Ebd770c9206c6b8047367c9eb9d27952735c8a092%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments