Mangalavaaram : అప్పడప్పడ తాండ్ర సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్‌ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అలాగే కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నారు మేకర్స్…ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర అనే స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అప్పడప్పడ తాండ్ర సాంగ్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..సాంగ్ లో తరుణ్ భాస్కర్ ఊరమాస్ గెటప్‌లో కనిపించాడు.ఇదిలా ఉంటే రేపు ఉదయం (నవంబర్ 14) 11:07 గంటలకు ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తుతం ఆ స్టిల్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.ఇటీవలే ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించారు.. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు… మంగళవారం నుంచి మేకర్స్ ఇప్పటికే మహాలక్ష్మమ్మ జాతర నేపథ్యంలో అగ్రెసివ్‌గా సాగే గణగణ మోగాలిరా సాంగ్‌ను లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.మంగళవారం సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, మరియు అదరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య మరియు అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!