లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. 10 రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ ఫిలీభీత్ టికెట్ ను వరణ్‌గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం, వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
Read Also: Mumbai : ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
‘వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి అని మేనకగాంధీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దాని గురించి ఆలోచిస్తామన్నారు. నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నాను.. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు పోటీ చేసే అవకాశం కల్పించారు.. అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అని తెలిపారు. ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్‌పూర్? అనే అనుమానం ఉండేది.. కాన, బీజేపీ అధిష్టానం సుల్తాన్‌పూర్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత ఉంది అని మేనకా గాంధీ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: బాప్టిస్ట్ చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు.. అన్ని మతాలను గౌరవిస్తాను
ఇక, టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే తొలిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్‌పూర్ సెగ్మెంట్‌లో సుమారు 101 గ్రామాల్లో ఆమె పర్యటించనున్నారు. ఇక, అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. దీంతో అతడికి ఈసారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన తుది శ్వాస వరకు ఫిలీభీత్ ప్రజల కోసం పని చేస్తాను అని తెలిపాడు.