Nandigama: అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మాట్లాడి అధిష్టానం సూచించిన వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పడంతో ఎమ్మెల్యే కూడా అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నందిగామ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా అధిష్టానం ఆశీస్సులతో కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. కొత్త బోర్డు ద్వారా నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. అధిష్టానం ఆమోదంతోనే చైర్మన్ ను ఎన్నుకున్నాం.. రెండు రోజులుగా ఒక కొలిక్కి రాలేకపోయినా.. చివరిగా తుది నిర్ణయం తీసుకున్నాం.. నిన్న తొందరపడి ముందే కోయిలలు కూసాయి.. వైసీపీ వారు నన్ను డమ్మీ అన్నారు.. ఇప్పుడు ఎవరు డమ్మీ అయ్యారు అంటూ ఎద్దేవా చేశారు.. 15 మంది కౌన్సిలర్ల బలంతో మేం బోర్డు ఏర్పాటు చేశాం.. వైసీపీ పక్షాన్ని పక్కకు నెట్టి పసుపు జెండా ఎగురవేశాం.. ఈ రోజు ఎవరు డమ్మీ అయ్యారు.. ఏది పడితే అది మాట్లాడితే కాదు అని హెచ్చరించారు.. మా కౌన్సిలర్లు నాకు మద్దతుగా ఉన్నారు.. అధిష్టానం ఆమోదంతోనే మున్సిపల్ బోర్డు చేజిక్కించుకున్నాం అన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..