Manda Krishna Madiga : మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలు చెపుతున్నాయని, మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నాడన్నారు మంద కృష్ణ. అధికారం లోకి వస్తె బీసీ నీ సీఎం చేస్తా అని ప్రకటించిన దమ్మున్న లీడర్ మోడీ అని, మాదిగల కు అండగా ఉంటానని నాలుగు రోజుల్లోనే మళ్ళీ వచ్చారన్నారు. ఏ ప్రధాని రాలేదని, దళితున్ని ప్రెసిడెంట్ చేశారు… అడవి బిడ్డను రాష్ట్రపతి చేశారన్నారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ లో ఇవి సాధ్యం కాలేదు… వాళ్లు ఎందుకు చేయలేదు.. కేసీఆర్ దీక్ష ను విరమింప చేసిన వారిలో నేను ఉన్నాను… కానీ అయన మంత్రి వర్గం లో ఒక్క మాదిగ మంత్రి లేరు. వెలమ లు నలుగురు… రెడ్డీ లు 7 గురు ఉన్నారు మంత్రి వర్గం లో… నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్… మనకు రాజకీయాలు కాదు.. మన భవిష్యత్ ముఖ్యం మంద కృష్ణ. కేసీఆఆర్ మాదిగలను అణచి వేశాడు… మోడీ మాదిగలను పైకి తీసుకెళ్లారు… తమిళనాడు లో మురుగన్ ఓడిన ఆయనకు రాజ్య సభ ఇచ్చి కేంద్ర మంత్రి చేశారు. కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్ ల పై ఊరించింది… మోడీ 48 గంటల్లో మహిళ రిజర్వేషన్ చట్టం చేశారు. సామాజిక న్యాయం గురుంచి కథలు చెప్పేది కాంగ్రెస్, బీఆర్ఎస్. న్యాయం చేసేది మోడీ. 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ ల గురించి ఉద్యమం చేసాము. కాంగ్రెస్ మాదిగ జాతిని మోసం చేసింది… మోడీ గారు మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ నినాదానికి న్యాయం చేయండి.. మోడీ మీ మనస్సు వెన్న పూస…. మీ గుండె గట్టిది…
Also Read
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే స్థాయికి వచ్చారు… దేశ ప్రధాని గారే మీ వేదిక మీదికి వస్తున్నారు అంటే మీ సమస్య పరిష్కారం అయినట్టే అని దేశ మేదావులు అన్నారు. మాట మీద నిలబడే నాయకుడు మీరు. దక్షిణాది మాదిగ లు బీజేపీ కి మద్దతు గా ఉంటారు’ అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే.. మంద కృష్ణ మాదిగ స్పీచ్ ను మోడీ కి ఎంపీ లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతున్నప్పుడు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ కి అండగా ఉంటామని మంద కష్ణమాదిగ కార్యకర్తలతో అనిపించారు.
తాజావార్తలు
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
-
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
-
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!