Site icon NTV Telugu

Manda Krishna Madiga : రేవంత్ రెడ్డి మాపై కామెంట్ చేయడం సమంజసం కాదు

Mandakrishna Madiga

Mandakrishna Madiga

ఎస్సీ వర్గీకరణ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మా్ర్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము గాంధీ భవన్‌కు వెళ్ళాము, ఆవేదన వ్యక్తం చేసామని, మాపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసాడని, రేవంత్ రెడ్డి ఎదుగుదలకు సొంత జాతి కన్నా మాదిగలు ఆయనకు అండగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి మాపై కామెంట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు మంద కృష్ణ. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, కొడంగల్ ఎమ్మెల్యేగా, ఎంపీ గా మాదిగ జాతి అండగా ఉండడంతో గెలిచాను అని రేవంత్‌ గతంలో చెపుకున్నాడని, రేవంత్ రెడ్డి మాదిగల రుణం తీర్చుకోవాలి, కానీ మాదిగ ఉద్యమాన్ని కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడాడని ఆయన మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Also Read : IBPS Clerk Recruitment: అడ్మిట్ కార్డులు విడుదల.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?

అంతేకాకుండా.. ‘ఎస్సీ వర్గీకరణ విషయంలో మీకు మాటిచ్చిన కిషన్ రెడ్డిని అడగండి అన్నాడు. MRPS ఆధ్వర్యంలో చేసిన ప్రతి ఉద్యమానికి కిషన్ రెడ్డి అండగా ఉన్నాడు. ఆయన వల్ల సమాజానికి మేలు జరిగింది. రేవంత్ రెడ్డి వల్ల ఏమి జరిగింది, మా లక్ష సాధనకు ఎవరు నిజాయితీగా పనిచేస్తే సహకారం ఇస్తాము. మేము గాంధీ భవన్ వెళ్లి వినతి పత్రం ఇస్తే మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అంటున్నాడు. ఎస్సీ వర్గీకరణ చేసేది పార్లమెంట్. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడా ? ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ లో కానీ BRS లో కానీ జాయిన్ అయిపోతాడు. ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మనిషి కాదు. ఆయన మాటకు విలువ లేదు. ఎస్సీ వర్గీకరణ మీద రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖెర్గే నుండి ప్రధాన మంత్రి కి లేఖ రాయించమని చెప్పాము, ఆయన నుండి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి మాటలు పిట్టలదొర మాటలు, ప్రతి సభలో మాట్లాడుతూ నేను సోనియా, రాహుల్ తో ప్రస్తావన తీసుకొస్తాను అని అంటాడు, కానీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడించేలేదు.

Also Read : Manmadhudu: ‘మన్మథుడు’ మళ్ళీ వచ్చేస్తున్నాడు..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు ఎందు వర్గీకరణ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ వరకు మా సహకారం, మద్దతు తీసుకున్నారు. మరి మీకు చిత్తశుద్దు ఎక్కడ. మీ పార్టీ కి చిత్తశుద్ధి ఎక్కడ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞత లేదు., అహంకారం తలక్కేకింది. మేము పేరుకు కులసంఘం కానీ మానవీయ కోణంలో ఉద్యమాలు చేసాము. మాకు కులత్వం కన్నా మానవీయ కోణం ముఖ్యం. కానీ రేవంత్ రెడ్డి కులము ముఖ్యం. ఎంతో మంతి రెడ్లను చూసాము, కానీ రేవంత్ రెడ్డి పచ్చి కులతత్వ వాదీ, రేవంత్ రెడ్డి మాదిగలను అడ్డుపెట్టుకొని ఎదిగాడు, ఆయన సమాజానికి చేసింది ఏంటి ? రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ఎందుకు వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడలేదు. ఆయన అహంకారవాది. రేవంత్ రెడ్డి ఎన్నో కండవాలు మెచ్చుకున్నాడు, తెలంగాణలో ఆతిపెద్ద కులం మాదిగలే కదా ? మరి మీ పార్టీలో మాదిగలకు అవకాశం ఇచ్చారా ? మీరు మాదిగలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమి ? 60 వేలు మాదిగలు ఉన్నకడా 6 వేలు ఉన్న మాలలుకు టికెట్స్ ఇస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ గా మాదిగలు ఉన్నారు కానీ ఇస్తున్నది ఏంటి ? ఢిల్లీలో నెలల తరబడి బీజేపీ పై ధర్నాలు చేసాము, బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైద్రాబాద్ వచ్చినప్పుడు వ్యతిరేకించాము . మేము బీజేపీ పై ఉద్యయం చేసాము. వర్గీకరణ విషయంలో ఎవరికి మద్దతు ఈవ్వాల్సింది అని తేల్చుకుంటాం. వర్గీకరణ చేస్తే బీజేపీకి అండగా ఉంటాం, వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చొరవ కూడా తీసుకోలేదు. మా కోసం ఎవరు నిజాయితీగా ముందుకు వస్తే తప్పకుండా వారికి మద్దతు ఇస్తాం. రేవంత్ రెడ్డి నిక్కర్ వేసుకున్నప్పుడే ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ కోసం యుద్ధం చేసింది. రేవంత్ మాకు నీతులు చెప్పడం ఏంటి ? భవిష్యత్తులో మాపై కుట్రలు చేసే వారిపై పొరాటం ఆగదు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version