NTV Telugu Site icon

Manda Krishna: తన బిడ్డ భవిష్యత్‌ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్

Manda Krishna

Manda Krishna

Manda Krishna: కడియం శ్రీహరి ఎమ్మార్పీఎస్ మీద, తమ మీద వ్యక్తిగత విమర్శలు చేశారని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్‌ అయ్యారు. తన స్వార్థాన్ని, తన అవకాశవాదాన్ని కప్పి పుచ్చుకోవడానికి మా మీద నిందరోపణ చేసే ప్రయత్నం చేశాడన్నారు. తన బిడ్డ భవిష్యత్ కోసమే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. పక్క వాళ్ల ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్లు బుద్ధి వున్నా వ్యక్తి కడియం శ్రీహరి అంటూ మండిపడ్డారు. తాటికొండ రాజయ్య ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడని ఆరోపించారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను మాత్రమే ఏదిగాడు, ఇప్పడు తన కూతురి ఎదుగుదలకు తపన పడుతున్నాడన్నారు. లేనిపోని మాటలు చెప్పి మాదిగల ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. దళితులను, మాదిగలను ఉపయోగించుకొని ఎదిగాడన్నారు.

Read Also: MP Arvind: ఉత్తమ్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలి.. ఎంపీ అరవింద్ ఫైర్

కాంగ్రెస్‌లో చేరాడు, తన బిడ్డకి టికెట్ తెచ్చుకున్నాడు.. ఎంత అవకాశవాదో తెలుస్తుందని మందకృష్ణ అన్నారు. సిట్టింగ్ ఎంపీగా వున్నా దయాకర్‌కి టికెట్ ఇస్తే.. దయాకర్‌ గెలిస్తే తన పరువు పోతుందని కాంగ్రెస్‌లో చేరాడన్నారు. బీఆర్‌ఎస్‌లో వున్నప్పడు మాదిగలకు అన్యాయం చేశాడని.. మళ్ళీ కాంగ్రెస్‌లో చేరి మాదిగల ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడన్నారు. ఘనపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా కూడా.. ఇందిరా కాంగ్రెస్‌నే నమ్ముకున్నది.. అయినా కూడా తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డాడని అన్నారు. ఎమ్మార్పీఎస్, మందకృష్ణ మాదిగ ఎదుగుదలకు తానే కారణమన్నాడని.. ఇది ఒక్క పచ్చి అబద్ధమన్నారు. దళిత దొర అని ఆనాడు కడియం శ్రీహరికి పేరు ఉన్నదన్నారు. నువ్వు మాదిగలకు చేసిన మేలు గోరంతా, ద్రోహం కొండత అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Read Also: Narendra Reddy: బండి సంజయ్ ది దొంగ దీక్ష.. నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మందకృష్ణ మాదిగ కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. ఎమ్మార్పీఎస్‌కు చేసిన మేలు ఏంటో చెప్పాలన్నారు. మేము నువ్వు చేసిన ద్రోహలు ఎన్ని ఉన్నాయో తెలుపుతామని.. మీకు దమ్ముందా అంటూ సవాల్ చేశారు. తన అవకాశాల కోసం చాలా పార్టీ లు మారుతున్నాడన్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్ అని కూడా తిట్టావ్ నువ్వు… ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళను పొగుడుతావంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై గౌరవం ఉందన్న మీరు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉన్న మాదిగ బిడ్డలు కడియం శ్రీహరి, ఆయన బిడ్డ తరఫున ప్రచారానికి వెళ్లొద్దన్నారు.