NTV Telugu Site icon

Manchu Vishnu : పుష్ప 2 కోసం కన్నప్ప వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు ?

Kannappa

Kannappa

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘క‌న్నప్ప’. ఈ మూవీని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు తెలిపారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కన్నప్ప మూవీని 25 ఏప్రిల్, 2025న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేర‌కు చిత్రం యూనిట్‌ సోషల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. కన్నప్పలో మోహ‌న్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజ‌ల్ వంటి భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి నెలకొంది.

Read Also:Tamil Nadu: ‘‘ఖాకీ’’ సినిమా లాగే.. ఫామ్ హౌజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..

తాజాగా విలేకర్లతో మాట్లాడారు మంచు విష్ణు. పుష్ప 2 కోస‌మే డిసెంబ‌రులో విడుద‌ల కావాల్సిన క‌న్నప్ప సినిమాను వాయిదా వేశారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ రెండు సినిమాల డిస్టిబ్యూట‌ర్లు ఒక్క‌రే. ఆ విష‌యం మీకు త్వరలో తెలుస్తుంది. క‌న్న‌ప్ప డిసెంబ‌రులో రాలేదేంటి? అని ఎవ‌రూ అడ‌గ‌రు. ఓ మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్ష‌కులు చూస్తారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలతో మాట్లాడి స్పేస్ ఇచ్చి రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీఎఫ్ ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కాలేదన్నారు. మంచి చిత్రాన్ని జనాలకు రీచ్ చేయడానికి ఏప్రిల్ కంఫర్టబుల్ గా ఉంటుందని రిలీజ్ అప్పుడు పెట్టుకున్నామన్నారు. పారిస్ లో ఓ సీక్వెన్స్ జరుగుతుంది అవి పూర్తికావడానికి డిసెంబర్ అవుతుందన్నారు.

Read Also:Bangladesh: మరీ ఇంత దారుణమా? ఆలయాలపై దాడులు.. హిందువులను ఊచకోత కోస్తున్నారు!(వీడియోలు)

ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ విడుదల చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌లో సౌత్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు ఈ పురాణ కథను ఐదు భాషల్లో చూసేందుకు సిద్ధం కావాలని అప్పట్లో టీం ప్రకటించింది.