Manchu Vishnu : పుష్ప 2 కోసం కన్నప్ప వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు ?
- ఏప్రిల్ 5, 2025న కన్నప్ప సినిమా విడుదల
- పుష్ప 2, కన్నప్ప డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కరే
- ఇంకా కొన్ని సీక్వెన్స్ లు మిగిలే ఉన్నాయన్న మంచు విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు తెలిపారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కన్నప్ప మూవీని 25 ఏప్రిల్, 2025న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రం యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కన్నప్పలో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి నెలకొంది.
Read Also:Tamil Nadu: ‘‘ఖాకీ’’ సినిమా లాగే.. ఫామ్ హౌజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజాగా విలేకర్లతో మాట్లాడారు మంచు విష్ణు. పుష్ప 2 కోసమే డిసెంబరులో విడుదల కావాల్సిన కన్నప్ప సినిమాను వాయిదా వేశారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ రెండు సినిమాల డిస్టిబ్యూటర్లు ఒక్కరే. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది. కన్నప్ప డిసెంబరులో రాలేదేంటి? అని ఎవరూ అడగరు. ఓ మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు చూస్తారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలతో మాట్లాడి స్పేస్ ఇచ్చి రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీఎఫ్ ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కాలేదన్నారు. మంచి చిత్రాన్ని జనాలకు రీచ్ చేయడానికి ఏప్రిల్ కంఫర్టబుల్ గా ఉంటుందని రిలీజ్ అప్పుడు పెట్టుకున్నామన్నారు. పారిస్ లో ఓ సీక్వెన్స్ జరుగుతుంది అవి పూర్తికావడానికి డిసెంబర్ అవుతుందన్నారు.
Read Also:Bangladesh: మరీ ఇంత దారుణమా? ఆలయాలపై దాడులు.. హిందువులను ఊచకోత కోస్తున్నారు!(వీడియోలు)
ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ విడుదల చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌లో సౌత్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు ఈ పురాణ కథను ఐదు భాషల్లో చూసేందుకు సిద్ధం కావాలని అప్పట్లో టీం ప్రకటించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!