NTV Telugu Site icon

Bhairavam: ‘గజపతి’గా మంచు మనోజ్‌.. ఫస్ట్‌ లుక్ పోస్టర్ వైరల్!

Manchu Manoj As Gajapathi

Manchu Manoj As Gajapathi

‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్‌ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ సమర్పణలో కెకె రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్‌ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

తాజాగా మంచు మనోజ్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. గజపతి పాత్రలో మనోజ్‌ నటించనున్నట్లు టీమ్‌ తెలిపింది. భారీ వర్షంలో కారు, పక్కనే గొడుగులు పట్టుకొస్తున్న జనాలు ఉండగా.. ముందు ఆవేశంగా వస్తున్న మనోజ్ నడుస్తున్నారు. వర్షంలో తడుస్తూ పవర్‌ఫుల్‌ లుక్‌లో మనోజ్‌ కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందులో నారా రోహిత్‌ వరదగా నటిస్తున్నారు.

Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడంటే?

భైరవంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమాకి యాక్షన్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ముగ్గురు హీరోలు నటిస్తోన్న ఈ చిత్రం ఎలా ఉండనుందా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Show comments