Site icon NTV Telugu

Manchu Manoj Daughter: మంచు మనోజ్ కూతురికి ఇంట్రెస్టింగ్ పేరు.. ఏంటో తెలుసా?

Devasena Mm

Devasena Mm

Manchu Manoj Daughter:
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ సోమవారం నాడు తన కూతురికి నామకరణం చేశాడు. పాప పేరులో మంచు మనోజ్ తన అత్త శోభా నగర్ రెడ్డి పేరు, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరును కలిపి ఉండేలా (Devasena Shobha MM) అంటూ నామకరణం చేశారు. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న మౌనిక పాపకు జన్మనిచ్చింది. ఆ విషయం సంబంధించి ఆనాడు పాప మేనత్త మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మా ఇంట్లోకి ” ఓ చిన్ని దేవత వచ్చింది.. అప్పుడే అతనికి మేము.. ఎంఎం పులి అంటూ నిక్ నేమ్ ” కూడా పెట్టామని తెలిపింది. ఇక నేడు పాపకు కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

Mumbai Hit-And-Run: ముంబైలో హిట్ అండ్ రన్ కేసు.. శివసేన (షిండే) నాయకుడు కొడుకు కోసం గాలింపు..!

ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా.. తన పాప పేరు గురించి చెప్పుకొచ్చాడు. దేవసేన శోభ ఎంఎం లో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా పేరు నామకరణం చేసినట్లు తెలిపాడు. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీ పై ఉండాలంటూ కోరాడు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు మౌనిక రెడ్డి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మౌనిక రెడ్డి అక్క భూమా అఖిలప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్

Exit mobile version