టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే కుటుంబం అంటే మంచు ఫ్యామిలి అనే చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు.. మనోజ్ మధ్య జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు. దీంతో తిరిగి ఈ ఫ్యామిలి మళ్ళి ఎప్పుడు కలుస్తుందా అని మోహన్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విభేదాలపై మంచు లక్ష్మి మొదటిసారిగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, కుటుంబంపై ప్రేమ, అలాగే తనపై వచ్చిన ఊహాగానాలపై నిజాయితీగా స్పందించింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ..
Also Read : Kantara – Chapter 1: ‘కాంతారా’ హిందీ OTT రిలీజ్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా?
‘‘సినిమా ప్రమోషన్స్ కాకుండా వరుస ఇంటర్వ్యూల్లో కనిపించడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక తల్లిగా, సోదరిగా, కుమార్తెగా అనేక పాత్రలు పోషిస్తున్నప్పటికీ తల్లిగానే నేను నాకు 10కి 10 మార్కులు వేసుకుంటాను’’ అని ఆమె చిరునవ్వుతో చెప్పింది. అలాగే తన కుటుంబంలో ఏర్పడిన వివాదాలపై మొదటి సారిగా స్పందించిన మంచు లక్ష్మి.. ఎంతో భావోద్వేగంగా.. ‘‘దేవుడు నిజంగా ఒక వరం ఇస్తానంటే మా కుటుంబం మళ్లీ పాత రోజుల్లా ఒక్కటై ఉండాలని కోరుకుంటాను. ఏ కుటుంబంలో నైనా గొడవలు రావడం సహజం. కానీ ఎంత తగాదాలు జరిగినా చివరికి మనతో మిగిలేది కుటుంబమే. రక్త సంబంధాలను దూరం చేయకుండా వాటిని కాపాడుకోవడమే ముఖ్యం. ఈ విషయంలో నేను రియాక్ట్ అవ్వనందుకు చాలా మంది నాకు ఏం బాధ లేదని వ్రాశారు. కానీ నేను అనుభవించిన బాధ, కలత నాకు మాత్రమే తెలుసు. నేను పబ్లిక్‌గా స్పందించలేదు కాబట్టి వాళ్లు ఊహాగానాలు సృష్టించారు. అది నా వ్యక్తిగత విషయం కాబట్టి బయట పెట్టాలనుకోలేదు. ఆ సమయంలో జరిగిన ప్రతిది నన్ను లోపల నుంచి బాధించింది’’ అని తెలిపింది. అంతేకాకుండా,
కుటుంబం ఒకటై ఉండటం కోసం తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని, దాని కోసం ఎలాంటి ప్రయత్నాలైనా చేయడానికి వెనుకాడనని లక్ష్మి మరోసారి హైలైట్ చేసింది.. ‘‘మన భారతీయ కుటుంబంలో చిన్న గొడవలు జరిగినా జీవితాంతం కలిసి ఉండకూడదని నిర్ణయించుకుంటారు. అది తప్పు. చివరికి మనం నమ్ముకో గలిగేది కుటుంబమే. దూరం పెరగడానికి అవకాశమే లేకుండా ప్రేమను పెంచుకోవాలి’’ అని చెప్పింది.ప్రజంట్ కుటుంబం మంచి కోరుకునే వ్యక్తిగా మంచు లక్ష్మి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
