సినీ నటి మంచు లక్ష్మి నేడు (మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని ఆఫీసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యాప్‌ల ప్రచారం కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత వెనకేశారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఈనాటిది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మంచు లక్ష్మిని విచారించింది. కేవలం మంచు లక్ష్మి మాత్రమే కాకుండా, గతంలో ఇదే కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ హీరోలు కూడా విచారణకు హాజరయ్యారు.
Manchu Lakshmi: సీఐడీ ఆఫీస్‌లో మంచు లక్ష్మి.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ!

Manchu Laxmi