Site icon NTV Telugu

Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో మాస్ అండ్ కామెడీ టైమింగ్‌తో చేసిన ఈ సినిమా ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడంతో, ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ 5(Zee5) సంస్థ, ఫడ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సిరిమా అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం, నయనతాన నటన ఈ సినిమాకు ప్లస్ కాగా.. వెంకటేష్ (వెంకీ మామ) ఇచ్చిన సాలిడ్ కామియో థియేటర్లలో విజిల్స్ వేయించింది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version