Site icon NTV Telugu

Mana Ooru Mana Badi : నేడు తెలంగాణలో మన ఊరు- మన బడి కార్యక్రమం

Mana Ooru Mana Badi

Mana Ooru Mana Badi

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నేడు పలు జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన మండల ప్రజా పరిషత్‌ పాఠశాలను ప్రారంభించనున్నారు. సాయంకాలం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగులు, విరిగిపోయిన బెంచీలు, అక్కరకు రాని మరుగుదొడ్లే గుర్తుకు వస్తాయి. కానీ, ఆ అపోహలన్నింటినీ తొలగించేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త హంగులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Also Read : Union Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్

ప్రభుత్వ పాఠశాలల రూపూరేఖలు సమగ్రంగా మార్చే లక్ష్యంతో ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన వాటిలో పనులు పూర్తయిన 1,210 పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించనున్నారు. గంభీర్ రావు పేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ ప్రారంభిస్తారు. అలాగే కందుకూరు మండలం రాచులూరు ఎంపీపీ స్కూలు సబిత ప్రారంభిస్తారు.

Also Read : Shivanna: నాకు క్షమించడం తెలియదు… ‘వేద’ ట్రైలర్ అదిరింది

Exit mobile version