NTV Telugu Site icon

West Bengal: ఉలిక్కిపడ్డ బెంగాల్.. కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ లోకి నిపా వైరస్ ఎంట్రీ ఇచ్చిందా?

Nipha

Nipha

Man who Returned from Kerala to Bengal Admitted to Hospital with Nipah Symptoms: కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం రేపుతుంది. నిఫా వైరస్ పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిందా అనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఓ 20 ఏళ్ల  యువకుడు పనికోసం  కేరళకు వలస వెళ్లాడు. అయితే అక్కడ ఉన్నప్పుడే అతడికి ఆరోగ్యం పాడయ్యింది. కేరళలోనే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. అక్కడి స్థానిక ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న తరువాత అతడికి జ్వరం తగ్గడంతో డిశార్జ్ చేశారు. అక్కడి నుంచి యువకుడు నేరుగా పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాడు. అయితే స్వగ్రామానికి రాగానే రెండు రోజుల్లోనే అతడు మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు.

Also Read: Tamilnaadu: తమిళనాడులో కలకలం.. నెల రోజుల్లో తొమ్మిది పెద్ద పులులు మృతి

తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ లక్షణాలు నిఫా వైరస్ లక్షణాలుగా కనిపించడం, అదీకాక అతడు కేరళ నుంచి వచ్చాడు అని తెలియడంతో వైద్యులు అతడికి నిఫా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇంకా అతడికి నిఫా వైరస్ సోకిందా లేదా అన్నది నిర్థారణ కాలేదు. తొలుత అతడిని నేషనల్ మేడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారని, ఆ తరువాత బెలియఘాటా ఐడీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. నీపా కేసులు అధికంగా ఉన్న కేరళ వచ్చిన యువకుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కేరళలో నిఫా వైరస్ కారణంగా మరణాలు కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కేరళలో ఈ కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు కేరళలో ఆరుగురుకి ఈ వైరస్ సోకింది. వారిలో ఇద్దరు దీని కారణంగా మరణించారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఇక్కడ నిఫా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2018 కోజికోడ్ లో, 2019లో ఎర్నాకులంలో 2021లో మళ్లీ కోజికోడ్‌లో ఈ నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి.