NTV Telugu Site icon

Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు

Vande Bharat Express

Vande Bharat Express

Vandebharat: రైల్వే శాఖ ప్రయాణికుల సౌలభ్యం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ వాటిని తప్పుగా ఉపయోగిస్తే మాత్రం మీరు ఇబ్బందులకు గురికాక తప్పదు. అన్ని మార్గదర్శకాలు తెలిసిన తర్వాత కూడా కొంత మంది అదే తప్పులు పునరావృతం చేస్తూ ఉంటారు. అలా తప్పులు చేసి ఇరుక్కుంటారు. సింగ్రౌలి నివాసి అబ్దుల్ ఖాదిర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టాయిలెట్ ఉపయోగించి నానా ఇబ్బందులు పడ్డాడు. అదేంటి టాయిలెట్ ఉపయోగిస్తే ఇబ్బంది ఏంటని ఆలోచిస్తున్నారా.. అదేంటో తెలుసుకుందాం..

అబ్దుల్ ఖాదిర్ భోపాల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి తన కుటుంబంతో కలిసి సింగ్రౌలీకి వెళ్లాల్సి వచ్చింది. అతను తన భార్య, బిడ్డతో కలిసి సమయానికి ముందే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ సంఘటన జూలై 15 సాయంత్రం జరిగింది. అబ్దుల్ ఖాదిర్ ఉదయం 8.55 గంటలకు సింగ్రౌలీకి రైలు పట్టవలసి వచ్చింది. అబ్దుల్ ఖాదర్ ప్లాట్ ఫాంపై ఉన్నాడు. అప్పుడే ఉన్నట్లుండి అతడికి టాయిలెట్ వచ్చింది. వెంటనే అక్కడ రెండవ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి వచ్చాడు. అతను టాయిలెట్ చేయడానికి రైలు వాష్‌రూమ్‌ను ఉపయోగించాడు. ఇక్కడే అతడి దురదృష్టం మొదలైంది. టాయిలెట్‌కి వెళ్లి వాష్‌రూమ్‌ నుంచి అబ్దుల్‌ ఖాదిర్‌ బయటకు వచ్చేసరికి రైలు స్టార్ట్‌ అయింది.

Read Also:Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!

ఖాదిర్ రాత్రి 7:24 గంటలకు రైలు ఎక్కాడు.. వందే భారత్ రాత్రి 7:25 గంటలకు ఇండోర్‌కు బయలుదేరింది. కదిర్ భయాందోళనకు గురై రైలు గేటు తెరవాలనుకున్నాడు.. కానీ గేటు తెరుచుకోలేదు. రైలు భోపాల్ స్టేషన్ నుండి ముందుకు కదలడం ప్రారంభించింది. ఖాదిర్ టిటి, పోలీసుల నుండి సహాయం కోరాడు. కాని డ్రైవర్ మాత్రమే రైలు తలుపు తెరవగలడని అతనికి సమాధానం వచ్చింది. దీని తరువాత టిటి ఖాదిర్‌కు తదుపరి స్టేషన్ వరకు రూ. 1020 (జరిమానాతో) టిక్కెట్‌ను తయారు చేశాడు.

ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో రైలు ఆగగానే ఖదీర్ కూడా దిగాడు. ఆ తర్వాత రూ.750 వెచ్చించి భోపాల్ వెళ్లేందుకు బస్సు పట్టాడు. భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సరికి భార్య, బిడ్డ అతని కోసం ఎదురు చూస్తున్నారు. సింగ్రౌలీకి అతని రైలు బయలుదేరింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అబ్దుల్ ఖాదిర్ రైలును టాయిలెట్ కోసం ఉపయోగించకుండా, స్టేషన్ లేదా ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ని ఉపయోగించినట్లయితే అతనికి ఇబ్బందులు ఎదురయ్యేవి కావు.

Read Also:Delhi: బాలికపై అమానుషం..పైలట్‌ దంపతులకు షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..