ఈ మధ్య ప్రజలు బయట జీవించడం కంటే ఫోన్ లోని సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది వారి క్రియేటివిటీ స్కిల్స్ వాడుతూ అనేక వీడియోలు చేస్తుంటారు. లేకపోతే ఈమధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కావడంతో ఎవరి క్రియేటివి వారు చూపిస్తూ వీడియోలు, డాన్సులు, మరిన్ని విశేషాలు తెలుపుతూ ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన వారు కూడా లేకపోలేదు. ఒక తాజాగా ఓ వ్యక్తి తన క్రియేటివిటీని ఉపయోగించి నేటిజెన్లతో పోస్ట్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా..? ఏం లేదండి అతనికి ఓ భార్య కావాలట. అంతేకాదు వచ్చే అమ్మాయికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని విషయంపై ఓ పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Kejriwal: కేజ్రీవాల్ రాజీనామాపై పిటిషన్లు.. హైకోర్టు ఘాటు వార్నింగ్
ఇక ఈ విషయం గురించి చూస్తే.. నా లైఫ్ లో ఒక ‘జూనియర్ వైఫ్’ పోస్ట్ ఖాళీ ఉందంటూ.. లింక్దిన్ లో పోస్ట్ చేశాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. ఇకపోతే, జితేంద్ర సింగ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘జూనియర్ వైఫ్’ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ లో జాబ్ టైప్.. ‘రెస్ట్ ఆఫ్ ది లైఫ్’ అంటూ.. ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూ ఉంటాయో పేర్కొన్నాడు. జీతం ఎంత అనేది కాన్ఫిడెన్షియల్.? అనుభవం ఏంటి.? కెరీర్ లెవెల్ ఏంటి.? రిక్వైర్‌మెంట్స్ ఎలా ఉంటాయి.? అనే అంశాలను ఒక్కోటిగా పేర్కొంటూ చాల ఇంట్రెస్టింగ్ గా తన రిక్వైర్మెంట్స్ ను తెలిపాడు. ఇక ఇందుకు గాను ఆసక్తి ఉన్న కాండిడేట్స్ వారి సీవీలను ఇన్‌బాక్స్ చేయండి అంటున్నాడు.
Also read: ML Iqbal Join in TDP: వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ ఇక్బాల్
అంత బాగానే ఉన్న చివరికి మాత్రం.. ‘ఇది జస్ట్ ఫన్నీ పోస్ట్.. జనాలను నవ్వించడం కోసమే పెట్టానని’ అతడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్టా లింక్డిన్ సెర్చెడ్ జాబ్ వెబ్ సైట్ లో ఆ వ్యక్తి ఈ పోస్ట్ పెట్టడంతో కామెంట్స్ మోత మోగిస్తున్నారు.