NTV Telugu Site icon

Turkey Earthquake: 160 గంటలు శిథిలాల కిందే.. ఆ వ్యక్తి మృత్యువును జయించాడు..

Turkey

Turkey

Turkey Earthquake: భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ రెండు దేశాలు చిగురటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత అక్కడి శిథిలాలు గుట్టలు, బయటపడిన మృతదేహాలు ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. దాదాపు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది.

Yevgeny Prigozhin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడే ఆగదు.. మరికొన్నేళ్లు సాగుతుంది

ఇదిలా ఉండగా.. ఓ వ్యక్తి శిథిలాల నుంచి దాదాపు 160 గంటల తర్వాత సజీవంగా బయటపడ్డాడు. టర్కీలో భూకంపం సంభవించిన 160 గంటల తర్వాత రష్యా, కిర్గిజిస్తాన్, బెలారస్ నుండి వచ్చిన రెస్క్యూ బృందాలు ఆదివారం కూలిపోయిన భవనం నుండి ఒక వ్యక్తిని సజీవంగా బయటకు తీసినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. శిథిలాల నుండి మనిషిని తొలగించే రెస్క్యూ పని నాలుగు గంటలకు పైగా కొనసాగిందని అని మంత్రిత్వ శాఖ సోమవారం టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో తెలిపింది. రక్షకులు శిథిలాల నుండి ఒక వ్యక్తిని లాగి తీసుకువెళుతున్నట్లు వీడియోను కూడా పోస్ట్ చేసింది. నిర్మాణాలు కుప్పకూలడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ఈ పని రాత్రిపూట జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరు దేశాల నాయకులతో మాట్లాడిన తర్వాత రష్యా గత వారం టర్కీ, సిరియాకు రక్షకుల బృందాన్ని పంపింది.