Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు
- ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడు
- ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంతా విచారంలో మునిగిపోయింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవారు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు.
Also Read:Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
విమాన ప్రమాదంలో 169 మంది భారతీయులు మృతి చెందారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం విజయ్ రూపానీ సహా విమానంలో 242 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచాడు. 11A సీటులోని ప్రయాణికుడు బతికి బయటపడ్డట్టు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని 38 ఏళ్ల రమేశ్ గా గుర్తించారు. స్వల్పగాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విమాన ప్రమాద బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Ramesh Viswashkumar, The sole survivor of the Air India crash escaped by jumping from the plane. He was on seat number 11A. #AirIndia #AhmedabadNews #Gujarat #PlaneCrash #ITReel pic.twitter.com/NsMBeZOkbX
— IndiaToday (@IndiaToday) June 12, 2025
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!