Site icon NTV Telugu

Tamilnadu : తనకోసం తెచ్చుకున్న మందు తాగిందని భార్యను చంపిన భర్త

Drink

Drink

Tamilnadu : మనుషులు మరీ మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మామూలు పరిచయాల కంటే మందు పరిచయాలు బలంగా ఉంటాయని వినికిడి అందుకేనేమో.. మందు, మనీ ఈ రెండింటి కోసం ఏం చేసేందుకు అయినా వెనుకాడడం లేదు. అలాంటిదే.. తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్నియాకుమారి జిల్లాలో ఓ వ్యక్తి తాను తాగేందుకు తెచ్చుకన్న మందు తన భార్య తాగిందన్న కోపంలో ఆమెను హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె అతడికి మూడో భార్య. భర్త తాను తాగుదామని మందు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ మద్యాన్ని మూడో భార్య తాగింది. దాంతో తనకు తాగేందుకు లేదన్న కోపంతో భార్యను చంపాడని పోలీసులు తెలిపారు.

Read Also:Terrible Video : పౌరుషం అంటే ఇదీ.. బతికినా చచ్చినా ఇలాగే ఉండాలి..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. నిందుతుడైన డేపురాయ్ పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికుడు. అతడి మూడో భార్య వసంతి పకాడియాతో కలిసి కట్టలైకుళంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఇటుకబట్టిలో పనిచేస్తున్నాడు. మందు తాగాలనిపించి.. షాపు దగ్గర తాగకుండా ఇంటికి తెచ్చుకుని దాచుకున్నాడు. ఆ మద్యాన్ని మూడో భార్య వసంతి తాగింది. దీంతో కోపంతో వచ్చిన అతను భార్యను కర్రతో చితకబాదాడు. మందు లేదన్న బాధతోనే ఆ రోజు రాత్రి నిద్రపోయాడు. ఆ తర్వాతి రోజు ఉదయం లేచేసరికి భార్య చనిపోయి ఉంది. దీంతో డేపురాయ్ కంగారుపడ్డాడు. ఆ తర్వాత తాను దొరకకుండా ఉండడానికి.. భార్య శరీరం మీద.. నేల మీద పడిన రక్తపు మరకలను నీళ్లతో కడిగేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇటుక బట్టి యజమాని చూశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డేపురాయిని అరెస్టు చేశారు.

Read Also:UK Pensioner : ఏంట్రా ఇదీ.. తాత శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి బ్యాంక్ కార్డులతో ఎంజాయ్

Exit mobile version