Bihar: బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భాగల్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్‌గా గుర్తించారు. ఆ వ్యక్తి వృద్ధ దంపతులను రాడ్లు, ఇటుకలతో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను జాతీయ రహదారిపై సుమారు 500 మీటర్లు ఈడ్చుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. నిందితుడిని ఫతేపూర్‌లో నివాసముంటున్న మహ్మద్ ఆజాద్‌గా గుర్తించారు.
Read Also: Viral Video: దోమను చంపబోయి బొక్క ఇరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్
బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు నిందితుడు మృతదేహాలను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడు మానసికంగా సరిగా లేడని ఎస్పీ తెలిపారు. నిందితుడు సబౌర్‌లోని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్ రోడ్డు పక్కన కూర్చున్న ఓ వృద్ధుడి బట్టలను తాకగా.. వృద్ధుడు నిరాకరించడంతో ఇటుక, ఇనుప రాడ్‌తో కొట్టినట్లు తెలిసింది. కానీ పూర్తి వివరాలకు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో అతడు మృతదేహాలను లాగుతున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో అతడిని ఎవరూ అడ్డుకోలేదు. ఈ కేసులో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారని ఎస్పీ అమిత్ రంజన్ తెలిపారు.