Site icon NTV Telugu

Man Kills Brother-In-Law: సోదరిని వేధిస్తున్నాడని.. బావను గొడ్డలితో నరికి హత్య

Crime News

Crime News

Man Kills Brother-In-Law: బావమరిది బతక కోరతాడంటారు.. కానీ ఆ బావమరిదే బావ ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తన సోదరితో తరచూ గొడవ పడే బావ సొంత బావమరిది గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన బుధవారం మోఖాడా తాలూకాలో జరగగా..నిందితుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

మొఖాడా ప్రాంతంలోని బ్రహ్మంగావ్‌లో నివాసం ఉంటున్న మహేంద్ర భోయే (30) తన భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. మహిళ సోదరుడు దిలీప్ మహాలే ఆమె గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. వివిధ సందర్భాల్లో ఈ జంట వివాదాన్ని పరిష్కరించాడని మొఖాడా పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు.

Kuwait Woman: భారత్‌లో అదృశ్యమైన కువైట్ మహిళ.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ

మహేంద్ర భోయే, అతని భార్య బుధవారం మళ్లీ గొడవ పడ్డారు. వారి ఇంట్లోనే ఉన్న బావమరిది దిలీప్ మహాలే దానిని పరిష్కరించేందుకు విఫల ప్రయత్నం చేశారు. తన సోదరిని బావ పెడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక బావపై గొడ్డలితో దాడి చేశాడు. మహేంద్ర భోయే అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దిలీప్ మహాలేను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారి వెల్లడించారు.

Exit mobile version