Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం. కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న తగాదా కూడా విషాదకరం అవుతుంది. అలా ఓ భర్త తీసుకున్న నిర్ణయం ఓ కొడుకుకు తల్లిని దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన నాసిక్‌లో జరిగింది. అప్పటివరకు ఆనందంతో వెల్లివిరిసిన ఇళ్లు ఇప్పుడు బోసి పోయింది.
Read Also:Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్
నాసిక్ సమీపంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అయితే తెల్లవారుజామున లేచి బయటకు రాగానే అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతని తల్లి నేలపై శవమై కనిపించగా, అతని తండ్రి ఉరివేసుకున్నాడు. ఈ షాకింగ్ సంఘటన నాసిక్‌లోని అద్గావ్ శివారాలోని తుల్జాభవాని రోహౌస్‌లో జరగింది. మృతులను విశాల్ ఘోర్పడే, ధనశ్రీ ఘోర్పడేగా గుర్తించారు. అనైతిక సంబంధం ఉందనే అనుమానంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య రెండో లేదా మూడో వ్యక్తి చేయలేదని, భర్త విశాల్ చేసిన హత్య అని అర్థమవుతోంది.
Read Also:BR Ambedkar: “అంబేద్కర్ టైపిస్ట్, ప్రూఫ్ రీడర్”.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్..
పెళ్లయినప్పటి నుంచి ధనశ్రీ పాత్రపై విశాల్‌కు అనుమానం. ఈ విషయంలోనే వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆఖరికి విశాల్ కి చాలా కోపం వచ్చింది. కొడుకు నిద్రిస్తున్న సమయంలో విశాల్ తీవ్ర ఆవేశానికి లోనైన ధనశ్రీ భార్యను తలపై బాది చంపేశాడు. అనంతరం తన జీవితాన్ని కూడా ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో అడ్గావ్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
