Chhattisgarh : కొన్ని నేర వార్తలు వింటే ఆశ్చర్యమేస్తుంది. దీనికి కూడా హత్యలు, కిడ్నాపులు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కథనం.. కోడి గుడ్ల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది. బిలాస్ పూర్ జిల్లా బర్తోరీ గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ స్థానికంగా బిర్యాని సెంటర్ నడిపిస్తు్న్నాడు. తను నడుపుతున్న బిర్యాని సెంటర్ అక్కడ ఫేమస్. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అక్కడికి వస్తుంటారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం యోగేశ్ బిర్యాని సెంటర్ కు పక్క గ్రామానికి చెందిన ముగ్గురు దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్, పరమేశ్వర్ మద్యం మత్తులో వెళ్లారు.
Read Also : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో పోటీకి సై అంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కౌంటర్లో కూర్చున్న యోగేశ్‌ను కోడిగుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే కోడిగుడ్లు ఇస్తానన్నాడు. ఇలా తాను కోడి గుడ్లు ఇవ్వలేదన్న కోపంతో యోగేశ్ పై ముగ్గురు యువకులు పీకలదాకా కోపం తెచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం మళ్లీ బిర్యానీ సెంటర్ వద్దకు కారుతో వచ్చారు. ఇదే క్రమంలో మళ్లీ వాగ్వాదం మొదలై ముగ్గురు యోగేశ్ ను కిడ్నాప్ చేసారు. నిర్మానుష్య ప్రాంతానికి అతడిని తీసుకెళ్లి దుర్బాషలాడుతూ చితకబాదారు. యువకుల దాడిలో యోగేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రికి యోగేశ్ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల చెరనుండి యోగేశ్ ను కాపాడారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
Read Also : IPL 2023: IPL 2023: సీఎస్కేతో కోల్‌కతా బిగ్ ఫైట్.. ఉత్కంఠ పోరులో గెలిచేది ఎవరు?