NTV Telugu Site icon

Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు

New Project (23)

New Project (23)

Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు. ఇలాంటి వారు తాము చేసేపనులు ఎంతవరకు సమంజసమనేది ఆలోచించరు. కేరళలో జరిగిన తాజా ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కన్ను మిన్ను కానకుండా తాను చేసిన పనికి కటకటాల్లోకి ఎక్కాల్సి వచ్చింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో తన కారును ఆనుకుని నిల్చున్న ఆరేళ్ల బాలుడిపై దాని యజమాని కాలితో తన్ని గాయపరిచాడు.

Read Also: Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను

బాలుడు కేవలం కారుకు ఎదురుగా నిలబడి ఉండగా అతడు వచ్చి బూతులు తిడుతూ తన బూటు కాలితో ఒక తన్ను తన్నాడు. గురువారం సాయంత్రం కన్నూర్‌లోని తలస్సేరి టౌన్‌లో ఓ రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో పోలీసులు కూడా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి మంత్రులు, విపక్ష నేతలు కూడా స్పందించడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు షెహజాద్‌ను నిన్న అరెస్ట్ చేశారు. బాధిత బాలుడి కుటుంబానికి మహిళా శిశు అభివృద్ధి విభాగం అన్ని విధాలా సాయం అందిస్తుందని మంత్రి వీణాజార్జ్ అన్నారు.

Show comments