NTV Telugu Site icon

Air Canada Plane: విమానం క్యాబిన్‌ తలుపు తెరిచి.. కిందకు దూకేసిన ప్రయాణికుడు!

Air Canada Plane

Air Canada Plane

Man Jumps From Plane: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్‌ కెనడా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల నుంచి కింద పడిపోయిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విమాన సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా టేకాఫ్‌కు దాదాపు ఆరు గంటల ఆలస్యమైంది. ఈ ఘటన జనవరి 8న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం… జనవరి 8న దుబాయ్‌కు వెళ్లాల్సిన బోయింగ్‌ 747 విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఉన్నపళంగా తన సీటులోంచి లేచి.. క్యాబిన్‌ తలుపు తెరిచాడు. విమాన సిబ్బంది అతడిని అడ్డుకునే లోపే.. కిందకు దూకేశాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో.. అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read: Rishabh Pant: రిషబ్‌ పంత్‌ ఒక కాలితో ఆడినా చాలు.. జట్టులోకి తీసుకోవాలి!

విమాన సిబ్బంది ప్రయాణికుడి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఎందుకు క్యాబిన్‌ తలుపు తెరిచి దూకాడో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విమానం ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరింది. ఇటీవల ఎయిర్‌ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల కుర్రాడు తన కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు.

 

Show comments