Site icon NTV Telugu

UP: అల్లాహ్ పేరుతో ఆత్మహుతి.. బక్రీద్ రోజు మేకకు బదులు తానే గొంతుకోసుకుని..

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఎవరూ హత్య చేయలేదని రాశాడు. ఆ సూసైడ్ నోట్ లో ఇలా రాసి ఉంది. “ఒక మనిషి తన సొంత బిడ్డలాగా మేకను పెంచి, దానిని బలి ఇస్తాడు. అది కూడా జీవమే. మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. అల్లాహ్ దూత పేరిట నన్ను నేను అర్పించుకుంటున్నాను.” అని పేర్కొన్నాడు. తన సమాధిని ఎలా రూపొందించాలో కూడా నోట్ ద్వారా వివరించాడు.

READ MORE: Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్

మరోవైపు.. మృతుడి భార్య హజ్రా ఖాటూన్ తన భర్తకు దయ్యాలు పట్టాయని, అతను తరచుగా అజంగఢ్ దర్గాను సందర్శించేవాడని చెప్పింది. మూడు రోజుల క్రితం దర్గా నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపింది. శనివారం.. అతను తన ఇంట్లో ధూపం వెలిగించి తంత్ర మంత్రం చేశాడని.. అకస్మాత్తుగా రక్తంతో తడిసి చనిపోయాడని పేర్కొంది. సమీపంలో ఒక భుజలి (పదునైన ఆయుధం) పడి ఉందని చెప్పింది. ఆమె వెంటనే, డయల్ 112 కు సమాచారం అందించింది. పోలీసులు గాయపడిన వారిని డియోరియా మెడికల్ కాలేజీకి, ఆపై గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. “అన్సారీ స్వయంగా గాయపరిచాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మేము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం.” అని అన్నారు.

READ MORE: Jangaon: వివాహిత అదృశ్యం.. ఆ కారణంతో తాను చనిపోతున్నట్లు లెటర్

Exit mobile version