Great Lover: ప్రియురాలిని ఒప్పించేందుకు ప్రేమికుడు చేసే సాహసాలను మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. సందర్భానుసారంగా వర్షం వస్తుంది. చలి పెరుగుతుంది.. కానీ ప్రేమికుడు కొంచెం కూడా చెదరడు. ప్రియురాలు రహస్యంగా తన ప్రేమికుడిని చూస్తూనే ఉన్నా ఆమె మనసు కరగదు. సరిగ్గా ఇలాంటి యదార్థ సంఘటనే చైనాలో చోటుచేసుకుంది.
ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలి కోసం ఆమె కార్యాలయం బయట మోకాళ్లపై నిలబడి తిరిగి రావాలని వేడుకున్నాడు. చేతిలో గులాబీల గుత్తితో తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి చూశాడు. ఇంతలో స్థానికులు అతని చుట్టూ గుమిగూడి ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో చలి కూడా పెరిగింది. కానీ ఇప్పటికీ ప్రేమికుడు తప్పుకోలేదు. దాదాపు 21 గంటల పాటు నిరంతరం మోకాళ్లపై కూర్చున్నాడు. ఈ సమయంలో మీడియా కూడా చేరుకోవడంతో పోలీసులు కూడా వచ్చారు. స్నేహితురాలు కనిపించడానికి ఇష్ట పడలేడటం లేదని అతనికి తెలిపారు. అయినా ఆ వ్యక్తి చలించలేదు. దీనిపై పలువురు విరమించుకోమని ప్రయత్నించినా ఆయన ఎవరి మాట వినలేదు.
Read Also: Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
అతను పట్టువదలుకండా మోకాళ్లపైనే నిల్చున్నాడు. తాను ఇక్కడ మోకరిల్లడం చట్ట విరుద్ధమా? అని పోలీసులను ప్రశ్నించారు. అయితే, నేరం కాకపోతే తనను వదిలేయాలని అడిగాడు. కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు విడిపోయిందని, అతను ఆమెను క్షమాపణలు కోరుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు 21 గంటల పాటు దాజౌలోని ఎంట్రన్స్ గేటు వెదుట మోకరిల్లాడు. చలిని భరించలేక చివరికి అతను మార్చి 29 ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Read Also:Srinivas Gude: టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు