NTV Telugu Site icon

Viral Video: పైథాన్ను ఎలా పట్టావు భయ్యా.. చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి

Snake

Snake

మాములుగా పాములను చూస్తే.. చిచ్చు పోసుకునే వారు చాలా మంది ఉన్నారు. అందులో విషపూరితమైన పాములకు కి.మీ దూరంలో ఉంటారు కొందరు జనాలు. మరికొందరేమో భయం బెరుకు లేకుండా.. సరదాగా పాములను పట్టేస్తుంటారు. అయితే ఈ వీడియోలో కూడా ఓ వ్యక్తి భారీ కొండచిలువను అస్సలు భయపడకుండా ఎంతో ఈజీగా పట్టుకున్నాడు. ఈ వీడియోను చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

CVC Report: కేంద్ర హోం శాఖపైనే అధికంగా అవినీతి ఫిర్యాదులు.. సీవీసీ నివేదికలో కీలక విషయాలు

ఈ వీడియోలో చీకటిలో చెట్ల పొదల్లో ఉన్న భారీ కొండచిలువను ఓ వ్యక్తి ఒక్కసారిగా పట్టుకుంటాడు. అయితే అతను మాములుగా వ్యక్తి కాడు.. పాములు పట్టే వ్యక్తి అందుకే అంత నిర్భయంగా భారీ పైథాన్ ను పట్టుకున్నాడు. ఒక రోడ్డు సమీపంలో అటుగా వెళ్తుండగా కొందరు ఆ పామును గమనించారు. ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకున్నాడు. అంతేకాకుండా కొండచిలువ తల దగ్గర పట్టుకోవడంతో.. అది అతని నడుమును గట్టిగా చుట్టేసింది. అతని చెరనుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. మరోవైపు ఆ వ్యక్తి పామును పట్టుకుంటుండగా అక్కడ ఉన్న చాలామంది తమ ఫోన్లలో వీడియో తీశారు. అంతపెద్ద కొండచిలువను వీడియోలో చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారి సంగతేంటి.

Shocking Incident: షాకింగ్ ఘటన.. ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపిన యాత్రికుడు

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆగస్టు 12న ఈ వీడియోను షేర్ చేయగా.. 96 వేలకు పైగా వీక్షించారు. 19 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తుండగా, ‘ఇంత భారీ కొండచిలువను పట్టుకోవడం నేను మొదటిసారి చూశాను’ అని కొందరు అంటున్నారు. ‘జాగ్రత్త తమ్ముడూ’ అని మరో వ్యక్తి రాశాడు.