ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా నగరాలలో రోడ్ల మీదికి వర్షపు నీళ్ళు నిండిపోయి ప్రజలు అవస్థ పడుతున్న సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. అయితే తాజాగా ఇలా వాన పడిన సమయంలో ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో గురించి చూస్తే..
Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల మృతదేహాలు లభ్యం
పూణే నగరంలోని ఎరవాడ ప్రాంతంలో ఒక యువకుడు వర్షం నీళ్లలో రోడ్డుపై ఫ్లోటింగ్ పరుపుతో సర్ఫింగ్ చేయడం ఈ వీడియోలో కనబడుతుంది. వర్షపు నీటిలో వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్డుకు అడ్డంగా పడుకొని సర్ఫింగ్ చేయసాగాడు. సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారందరూ అతనిని చూసి వీనికి ఏమైనా పిచ్చా అనుకొంటూ అతని ని తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. పూణేలోని ఎరవాడ ప్రాంతంలో ఈ వీడియో రికార్డ్ అయినట్లు సమాచారం. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా రోడ్డుపై వరద నీరు బీభత్సంగా ప్రవహిస్తోంది.
Gangs Of Godavari : కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న విశ్వక్ సేన్ మూవీ..
ఆ సమయంలో ఆ యువకుడు వీధిలో ఉన్న నీటిపై ఓ తేలే లాంటి తెల్లటి చాపపై పడుకొని ప్రవహించే నీటితో ఎంజాయ్ చేస్తున్నాడు. మనలో చాలామంది వానను ఎంజాయ్ చేయడం చూసి ఉంటాం. కానీ., ఇలాంటి వింత మనిషిని చూడటం ఇదే మొదటిసారి కాబోలు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.