NTV Telugu Site icon

Delhi: ఏంట్రా ఈ చెండాళం.. బస్సులో అమ్మాయి ముందే ప్యాంట్‌లో చేయి పెట్టుకుని..

Dtc Bus

Dtc Bus

Delhi: శృంగారం లేదా హస్త ప్రయోగం అనేది మన దేశంలో బహిరంగంగా చేసుకోరు. నాలుగు గోడల మధ్యనే దాన్ని చేసుకునే సంప్రదాయం మనది. అయితే ఈ మధ్య కొందరు శృంగారం, హస్త ప్రయోగం ఎక్కడంటే అక్కడ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో శృంగారం చేసుకుంది. ఇంకొక వ్యక్తి బస్సులోనే హస్త ప్రయోగం చేసుకున్నాడు. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరోసంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణిలో ఓ వ్యక్తి కదులుతున్న బస్సులో యువతి ముందే హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. వైరల్ వీడియో ప్రకారం, నిందితుడు మంగళవారం డీటీసీ బస్సులో హస్తప్రయోగం చేశాడని, అమ్మాయి గట్టిగా అరవడంతో బస్సులో ఉన్న మార్షల్ సందీప్ చకారా అతనిని పట్టుకున్నారు. పట్టుబడిన తరువాత నిందితుడు ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఇది బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన నిందితుడిని పోలీసులకు అప్పగించామని, అయితే ఇంకా ఎటువంటి ఫిర్యాదు నమోదు కానందున అరెస్టు చేయలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!

బుధవారం జరిగిన సంఘటన గురించి సమాచారం అందుకున్న తరువాత, పోలీస్ స్టేషన్ నార్త్ రోహిణి సబ్-ఇన్‌స్పెక్టర్ సుమన్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి లేదా దీనికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలని సంప్రదించగా, ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు. భవిష్యత్‌లో ఆరోపించిన సంఘటనకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే, చట్టంలోని తగిన సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Show comments