Site icon NTV Telugu

Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!

Thalapathy Vijay

Thalapathy Vijay

Police case filed against Thalapathy Vijay: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్‌పై ఫిర్యాదు చేశారు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల కోసం రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన విజయ్‌.. తాజాగా చెన్నై వచ్చాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌.. రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చెన్నై వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌.. నీలాంగరై పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నాడు. విజయ్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయను చూసేందుకు ఎగబడ్డారు.

Also Read: Aadujeevitham: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘ఆడు జీవితం’.. 25 రోజుల్లోనే..!

విజయ్‌తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు 200 మందికి పైగా ఒకేసారి పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. ఓ వైపు అనుచరులు, మరోవైపు ఫాన్స్ హడావుడితో అక్కడ సాధారణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయమై సెల్వం అనే వ్యక్తి.. చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్మాదు చేశాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 200 మందితో పోలింగ్‌ కేంద్రంలోకి విజయ్‌ వెళ్లారని, క్యూలో నిలబడకుండా ఆయన నేరుగా వెళ్లి ఓటు వేశారని పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో విజయ్‌ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.

Exit mobile version