Heart attack : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలి వ్యక్తి మృతి..
- వివాహ వేడుకలో చోటు చేసుకున్న విషాదం
- డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి మృతి
- పాలకొండ మండలం బాసూరులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు(38) డీజే పాటలకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు. ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
READ MORE: Amit Shah: “మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము”.. పాక్‌కు అమిత్ షా వార్నింగ్..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. డీజే శబ్దాలకు గుండెపోటు వస్తుందా? అంటే అవునంటున్నారు నిపుణులు. డీజే శబ్దాలు ఒక్కసారిగా మొదలై.. షాక్‌కు గురయ్యే పరిస్థితి ఎదురైతే గుండెపై ప్రభావం పడుతుంది. అది కూడా అప్పటికే గుండె జబ్బులు లేదా ఏదైనా బ్లాక్స్ వంటివి ఉంటే ఒక్కసారిగా మొదలయ్యే డీజే శబ్దంతో ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది. ఆ సందర్భాల్లో గుండెపోటు రావడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరగవచ్చు. డీజేల భారీ శబ్దాల వల్ల గుండె దడ మొదలై గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కానీ, అప్పటికే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!