NTV Telugu Site icon

Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు

Sleep Walk

Sleep Walk

Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ సంఘటనను రికార్డుల్లో వేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన స్టోరీని కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసుకుంది.

Also Read: Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో

వివరాల్లోకి వెళ్తే..మైఖేల్ డిక్సన్ అనే బాలుడుకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అతడు తరచూ తన ఇంట్లోనిద్రలో నడిచేవాడు. అయితే 1987 ఏప్రిల్ 6 న మైఖేల్ డిక్సన్ అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతూ కనిపించాడు. అప్పుడు అతడు చెప్పులు లేకుండా నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. దాదాపు తెల్లవారు జామున 2.45 గంటలకు అతడిని రైల్వే సిబ్బంది మైఖేల్ గుర్తించాడు. అతని గురించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. పోలీసులు అతనిని అడ్రస్ గురించి అడిగితే ఇల్లినాయిస్‌ లోని డాన్ విల్లే నుండి వచ్చానని చెప్పాడట. అయితే ఇక్కడి ఎలా వచ్చావని అడిగితే నిద్రలో నడుచుకుంటూ తన ఇంటికి సమీపంలోని స్టేషన్ నుండి గూడ్స్ రైలు ఎక్కి వచ్చానని తెలిపాడట. డిక్సన్ నిద్రలోనే 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే రైలు ఎక్కింది, ఇంత దూరం ప్రయాణించింది ఏవి తనకు గుర్తులేవని డిక్సన్ తెలిపాడు. అతని అసాధారణ పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు అతని తల్లికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న డిక్సన్ తల్లి తన కొడుకు ఇంటిని దాటి ఇంత దూరం వస్తాడని అనుకోలేదని తెలిపింది. అయితే అంత నిద్రలో ప్రయాణించినా డిక్సన్ క్షేమంగానే ఉన్నాడు. అప్పుడు అతని వయసు 11 యేళ్లు మాత్రమే. ఈ వింత కేసును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఖాతాలో నమోదు చేసుకోవడమే కాదు ఈ స్టోరిని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సంవత్సరాలుగా నిద్రపోని వారిని, గురక శబ్దం చేసేవారిని, పెద్దగా ఆవలించడం, ఎక్కువగా కోమాలో ఉన్న ఘటనలను నమోదు చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిద్రలో నడవడం కూడా నమోదు చేశామని వెల్లడించింది. నిద్రలో నడవడం ఒక సమస్య అయినప్పటికీ దానితో కూడా రికార్డు క్రియేట్ చేశాడు మైఖేల్ డిక్సన్.