NTV Telugu Site icon

Andhra Pradesh: మూడు రోజులుగా సెల్‌ టవర్‌పైనే.. ఇన్యూరెన్స్‌ డబ్బులు ఇస్తేనే దిగుతాడట..!

Cell Tower

Cell Tower

Andhra Pradesh: కొన్ని చోట్ల సెల్‌ టవర్లు ఎక్కి హల్‌చల్‌ చేయడం.. పోలీసులు, కుటుంబసభ్యులు.. ఇలా ఎవరైనా సర్దిచెబితే.. కొన్ని గంటల్లో కిందికి దిగిపోయిన సందర్భాలు చూశాం.. కానీ, ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్ టవర్ పైనే తిష్ట వేశాడు.. తన డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే.. కిందకు దిగుతాను అంటున్నారు.. దీంతో.. గత రెండు రోజులుగా పోలీసులు, అధికారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Read Also: China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన తండ్రి ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు బ్యాంకు నుండి ఇప్పించాలని సెల్ టవర్ పైకెక్కి రెండు రోజులుగా తిష్టవేశాడు లోకం ఏసు అనే వ్యక్తి.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం చినమిరం గ్రామానికి చెందిన లోకం ఏసు. తన తండ్రి సత్యనారాయణకు చిన్నమిరం ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ద్వారా 20 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించానని.. తన తండ్రి యాక్సిడెంట్‌లో మృతి చెందగా.. ఇన్సూరెన్స్ క్లైమ్ చేయమని అడిగితే.. మీరు ఇన్సూరెన్స్ చేయించలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని ఆరోపిస్తున్నాడు. గురువారం ఉదయం 5 గంటలకు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేయడం ప్రారంభించాడు.. రెండు రోజులు గడిచి మూడో రోజుకి చేరింది ఆ యువకుడి ఆందోళన.. ఇక, ఘటనా స్థలానికి పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని బాధితుడుతో డీఎస్పీ, ఆర్డీవో సంప్రదింపులు జరిపినా.. తనకు న్యాయం జరిగేంత వరకు సెల్ టవర్ దిగే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. దీంతో, రెండు రోజులుగా అధికారులు సంఘటనా స్థలంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థిత దాపురించింది.